ads

Monday, 13 February 2017

ఈ తరహా కథలతో దర్శకులు వస్తే నిర్మించడానికి నేను సిద్ధం, ఆ నిర్మాత…! ఏ తరహా..?

ఈ తరహా కథలతో దర్శకులు వస్తే నిర్మించడానికి నేను సిద్ధం, ఆ నిర్మాత…!  ఏ తరహా..? 


సినిమా ఇండస్ట్రీ లో చిన్న సినిమాగా  మొదలై పెద్ద సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతి తక్కువ సినిమాల వరుస లో చేరబోతున్న మరో సినిమా   334 వ కథ, అంతా కొత్త వాళ్ళతో,  ఒక డిఫెరెంట్ కథ కథనం తో తెరక్కిన ఈ సినిమా ఈ నెలాఖరున  మన ముందుకు రానుంది.  అయితే ఈ సినిమా ని  క్రియేటివ్ మైండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డాక్టర్. రాకేష్ ప్రతాని సమర్పించగా చంద్రనాధ్ నిర్మించారు వెంకట్ నారాయణ  దర్శకత్వం వహించారు.   
అయితే ఈ సినిమా సమర్పకుడు రాకేష్ మాట్లాడుతూ ఈ కథ పూర్తిగా హర్రర్ కం థ్రిల్లర్ జోనర్ లో సాగుతుందని, కథ వినిన వెంటనే చాలా కొత్త గా ఫీల్ అయ్యి ఎంతో ఇష్టం తో తెరక్కేంచాం, ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ కి  మోషన్ పోస్టర్ కి వస్తున్న ఆదరణను చూసి మా కథ ఫై  ఇష్టం ఇప్పుడు నమ్మకం గా మారింది అన్నారు. ఇంకా అయన మాట్లాడుతూ ఈ లాంటి లేదా ఇంకా భిన్నమైన కథ లతో ఏ దర్శకుడు అయినా నా దగ్గరకు వస్తే మల్లి నిర్మంచగలిగే అంత ఇష్టాన్ని ప్రేక్షకులే కలిగించారన్నారు ఆయన.  
 ఈ సినిమా  దర్శకుడు వెంకట్ నారాయణ  మాట్లాడుతూ చూసే ప్రతి  ప్రేక్షకుడు కథ ను కొత్తగా ఫీల్ అయి, కథనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు అన్నారు. 
ఈ సినిమా టీం మాట్లాడుతూ ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా వచ్చాయి,  మాకు కథ పై వున్న నమ్మకం ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రతి ప్రేక్షకుడు కి తెలుస్తుంది అన్నారు.  
అయితే, ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ కాగా, ఈ మధ్య రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ మరింత ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కు రిలీజ్ ముందు నుండే  ప్రేక్షకుల దగ్గర  వస్తున్న ఆధరణ చూసి సినిమా పెద్దలు కూడా ఈ సినిమా వైపు చూస్తున్నారని ఫిలిం నగర్ టాక్. మంచి సినిమా ని ఆదరించి అభిమానించే మన సిని జనం మరి ఈ 334 వ కథ ను ఇంత పెద్ద హిట్ చేస్తారో మరి కొద్ది రోజులలోనే తెలియనుంది.




No comments:

Post a Comment