ads

Sunday, 12 February 2017

నందమూరి కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తున్న ఆ మెగా హీరో...?

నందమూరి కుటుంబానికి దగ్గరవ్వాలని చూస్తున్న ఆ మెగా హీరో...? 




సినిమా ఇండస్ట్రీ లో తమ తమ సినిమా లతో నిత్యం పోటి పడే కుటుంభాలు అంటే ఆ రెండే. ఒకటి నందమూరి కుటుంబం రెండు కొణిదెల కుటుంబం. ఎంత పోటి ఇచ్చుకున్న ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పటికి మంచి అనుబంధమే ఉంది. కాగా ఆ అనుబంధాన్ని మరింత పెంచేలా మెగా మేనల్లుడు సాయి ధరంతేజ  వ్యూహాలు రచిస్తున్నాడంటా అంటే అవుననే అంటున్నాయి అతగాడి ఆలోచనలు. 
ముందు నుండి సాయి అందరితో కలివిడి గానే వుంటూ వచ్చాడు. మొన్న గౌతమి పుత్ర సినిమా చూసి బాలయ్య మా తరానికి ఆదర్శం అంటూ ట్వీట్ చేసాడు. నిన్న తన జవాన్ సినిమా ని నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పూజా కార్య క్రమాలు జరిపించుకున్నాడు. 
ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా బాలయ్య డైలాగ్  ‘’నీ లాంటోడు అడుగడుగునా వుంటారు, అదే నాలాంటోడు అరుదుగా ఉంటాడు’’... ని  తన సినిమా లో పెట్టుకున్నాడు. 
ఈ రోజు రిలీజ్ అయిన విన్నర్ ట్రైలర్ లో అయితే టిడిపి కి సపోర్ట్ చేస్తూ  మాకు ఇష్టం లేకుండా ప్రత్యెక  హోదా ఇచ్చేస్తారా అంటూ అదిరిపోయే డైలాగ్ పేల్చాడు.  
కాగా ప్రత్యెక హోదా మీద గత కొద్ది నెలలగా చర్చ జరుగుతున్న ఈ తరుణం లో సాయి ఇలాంటి డైలాగ్ చెప్పడం, నందమూరి కుటుంబం పట్ల తన తీరు ని చూసి అందరూ సాయి ది చాలా గొప్ప గుణం అని, మెగా కుటుంబం లో తను మరో పవన్ కళ్యాణ్ లా ఏదగాలను కుంటున్నాడని, అందుకే అందరితో మంచిగా ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు....

No comments:

Post a Comment