ads

Saturday, 11 February 2017

మొనగాడిగా రానున్న రామ్ చరణ్!

మొనగాడిగా రానున్న రామ్ చరణ్!







మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రానున్న సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ వినబడుతోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా టైటిల్ కోసం చాలా పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించనున్న ఈ సినిమా కోసం టైటిల్ లోనూ ఆ పల్లెటూరి ఫ్లేవర్ ఉండాలని చూస్తున్నారట. 
చెర్రీ-సుకుమార్ కాంబోలో దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే రెండు మూడు టైటిల్స్ ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా ‘రేపల్లె’, ‘పల్లెటూరి మొనగాడు’ లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారట. ఆ టైటిల్ కు తగ్గట్టే రామ్ చరణ్ కూడా ఓ మొనగాడిగా కనిపించనున్నాడని టాక్. 

No comments:

Post a Comment