ads

Saturday, 11 February 2017

కూతురికి కొత్త రూల్ పెట్టిన శ్రీదేవి

కూతురికి కొత్త రూల్ పెట్టిన శ్రీదేవి


మాజీ అందాల తార శ్రీదేవి.. ఇప్పటికీ మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. వయసు పెరిగినా వన్నె తరగని అందం శ్రీదేవి సొంతం అని ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఉంటారు. హీరోయిన్ గా శ్రీదేవి శకం ఎప్పుడో అయిపోయిందనే వాస్తవం ఆమె కూడా గుర్తించి చాలా కాలమే అయింది. ఇప్పుడు అందరి దృష్టి.. మరికొన్నాళ్లలో సినీ అరంగేట్రం చేయనున్న శ్రీదేవి కూతుర జాన్వి కపూర్ పైనే ఉంది.

తన పెద్ద కూతురుని హీరోయిన్ చేయడం విషయంలో శ్రీదేవి చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది. స్టైలింగ్ నుంచి ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ  భామకు.. ఇప్పుడీ అందాల మమ్మీ కొత్త రూల్ పెట్టిందట. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఫోటోలను సోషల్ మీడియాలో రివీల్ చేయద్దని చెప్పిందట. ఎప్పటికప్పుడు ఆమె లుక్స్ బైటకు వచ్చేస్తుండడంతో.. కూతురు సినీ ఎంట్రీపై హైప్ క్రియేట్ అవదని.. శ్రీదేవి ఉద్దేశ్యం కావచ్చని అంటున్నారు బాలీవుడ్ జనాలు.గతంలో కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదంటూ ఇలాగే ఓ రూల్ పెట్టింది జాన్వీ కపూర్ మమ్మీ.

అయితే.. జాన్వీ కపూర్ అరంగేట్రం కోసం శ్రీదేవి తెరవెనుక ప్రయత్నాలు చాలానే చేస్తోంది. మరోవైపు.. ఇన్నాళ్లు జాన్వీ సెల్ఫీలతో అందాల విందు చేసుకున్న అభిమానులు.. ఇకపై ఈ అమ్మడు కనిపించదేమో అని ఇప్పటినుంచే బెంగ పెట్టేసుకుంటున్నారు. 

No comments:

Post a Comment