క్లైమాక్స్ చూసి ఆమె నోట మాట రాలేదు
‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో అక్కినేని నాగార్జున అభినయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అన్నమయ్య.. శ్రీరామదాసు సినిమాలకు దీటుగా ఈ చిత్రంలోనూ అద్భుతంగా నటించి మెప్పించాడు నాగ్. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నాగ్ నటన అందరినీ కట్టిపడేస్తోంది. ఈ సన్నివేశాలు చూసి తన భార్య అమల కదిలిపోయిందని అంటున్నాడు నాగ్.
‘‘ఓం నమో వేంకటేశాయకు వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. నా ప్రియమైన భార్య అమల ఈ సినిమా చూసి కదిలిపోయింది. క్లైమాక్స్ చూసి ఆమె నోట మాట రాలేదు. సినిమా అయ్యాక నన్ను హత్తుకుంది. 20 నిమిషాల పాటు నన్ను వదిలిపోలేదు. నేనంటే అమలకు ఎంత ఇష్టమో కూడా అప్పుడే నాకు తెలిసింది’’ అని నాగార్జున తెలిపాడు.
ఈ సినిమాకు సంబంధించి తనకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ గురించి చెబుతూ.. ‘‘సినిమా చూసిన ఒకరు ఇందులో నటిస్తున్నపుడు మీకు నిజంగానే దేవుడు కనిపించాడా.. అందుకే అలాంటి హావభావాలు పలికించగలిగారా అని అడిగారు. అదే నాకు గొప్ప ప్రశంస’’ అన్నాడు. ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో కమనీయం పాట తన ఫేవరెట్ అని నాగ్ చెప్పాడు. ఓం నమో వెంకటేశాయ తర్వాత తనకు నమ్మకం మీద నమ్మకం పెరిగిందని.. ఈ ప్రపంచాన్ని.. మనుషుల్ని మరింతగా నమ్ముతున్నానని నాగ్ అన్నాడు.
No comments:
Post a Comment